International

Friday 22 August 2014

మహారాజశ్రీ రాజకీయనాయకులారా


అయ్యా మహారాజశ్రీ రాజకీయనాయకులారా ,
కొన్ని కోట్ల మంది వేసిన ఓట్ల వలన మీకు ఈరోజు ఈ సీట్లు వచ్చింది . మరి మీరు వారికి చేస్తున్న ప్రత్యుపకారం ఏమిటి అని ఏరోజైన ఆలోచించారా ? మీరు ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తిసున్న విదానాన్ని మీరు ఒక సారి సమీక్షించుకోవాలి .  మీరు చర్చిన్చుకోవాల్సిన విషయాలు కొన్ని వందలు వున్నయి.  మరి వాటిని అంతా  గాలికి వదిలేసి ఈ విదంగా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు ?
తెలుగు జాతి రెండుగా మూకలు చేయబడింది . కొన్ని కోటల హృదయాలు బాధతో బరువెక్కి మీరు వేయబోయే  ప్రతి ఒక్క అడుగు వైపు ఏంటో ఆశగా ఎదురు చూస్తోంది . ఆంధ్రుల  జీవితంలో ఇది ఒక చారిత్రక మలుపు అన్న విషయాని మరువకండి . ఈరోజు మీరు వేసే ప్రతి ఓకే అడుగు ఓకే చారిత్రక మలుపు అని మా అబిప్రయమ్. అందుకే మీకు చర్చించుకోవడాని కొన్ని వేల సమస్యలు వున్నాయి . దయచేసి వాటిపైన కాస్త  ద్రుష్టి పెట్టిన వాటికోసం కొంత సమయం కేటాఇంచండి .
ఐన కాని మీకు నిజంగా ఒకరిపైన ఒకరి కి అధిపత్యం నిరూపించుకోవాలి అనుకుంటే , వారి వారి నియోజకవర్గంలో అబివృద్ధి చేసి ఎదుటవారిని నోరు మూయించండి .

కాని ,
అన్నింటికంటే ముందు మీ నియోజకవర్గంలో వున్న ప్రజల గురుంచి పూర్తి వివరాలు సేకరించండి .
1. మొత్తం ఎన్నని కుటుంబాలు వున్నయి. వ్యవసాయం పైన అదారపడ్డ కుటుంబాలు ఎన్ని ?
2. ఎంతమంది నిరుద్యోగులు వున్నారు ? ఎంతమంది వుద్యగులు వున్నారు ?
3. నీరు లేక ఎండిపొఇన బూమి ఎంత? నీరు వూన బూమి ఎంత ?
నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాసాను . ఇంకా  ఎన్నో సమస్యల ప్రతి గ్రామంలోనూ  మీకోసం ఎదురు చోస్తుంది ...

ఆ సమస్యల పైన చర్చించడానికి ప్రయత్నిస్తే అది అందరికి ప్రయోజనంగా వుంటుంది అని నా అబిప్రాయం

1 comment:

  1. //1. మొత్తం ఎన్నని కుటుంబాలు వున్నయి. వ్యవసాయం పైన అదారపడ్డ కుటుంబాలు ఎన్ని ?
    2. ఎంతమంది నిరుద్యోగులు వున్నారు ? ఎంతమంది వుద్యగులు వున్నారు ?
    3. నీరు లేక ఎండిపొఇన బూమి ఎంత? నీరు వూన బూమి ఎంత ?
    నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాసాను . ఇంకా ఎన్నో సమస్యల ప్రతి గ్రామంలోనూ మీకోసం ఎదురు చోస్తుంది ...//

    Nice. I had suggested same thing to CM -AP in the year 1999. But in vain.

    I had forwarded the same thing from my sent box to KCR. My mail may be the inspiration for the Mega survey at Telangana.

    ReplyDelete