International

Wednesday 29 August 2012

నేల తల్లి ఆవేదన అర్థం కాదా?

ఈనాటి రాజకీయనాయకుల ప్రవర్తన , నీటి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం చరిత్ర క్షమించదు . తొమ్మిది సంవత్సరాలు  అధికారంలో సాగిన హైటెక్ ప్రబుత్వం ఐన లేక రైతు ప్రబుత్వం అని బిల్డుప్ ఇస్తున్న ప్రబుత్వమైన నీటి ప్రాజెక్టులపైన  అవలంబిస్తున్న వైకారి సరి కాదు .  ముక్యంగా ప్రాజెక్టులకు అవసరమైన బూ సేకరణ అనుమతుల సేకరణ మరియు బడ్జెట్ కేటాయింపులు చాలా త్వరగా జరగాలి.  వీటిపై ప్రస్తుత రాజకీయనాయకులు అవలంబిస్తున్న విదానం రేపటి తరానికి ప్రమాద సూచన .
ఇప్పటికే కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది . దానిని అరికట్టాల్సిన అవసరం మానుకు ఎంతైనా వుంది . అవసరమైన డ్యాములు నిర్మించడం , ఎత్తిపోదక పదకాలు ఇంకా దారులు ఏదైనా కాని నీటి వ్రుదాను అరికట్టాలి . అన్నిటికంటే ముక్యంగా కరువు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు నీటిని తరలించడానికి వీలు పడే విది విదానాలను పరిశీలించి వాటిని అత్యంత ముఖ్యమైన అంశంగా బావించాలి.  అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తించిన నీరు లేని ప్రదేశాలను బౌగోలికాపరంగా ఎత్తైన ప్రదేశాలు మరి లోతట్టు ప్రాంతలుగా విడతీసి ప్రాముఖ్యత ఇవ్వాలి . ఎందుకంటే ఎత్తైన ప్రాంతానికి నీరు చేరవేయడం ఎంత కష్టమో మరి అంతే సులువుగా ఆ  నీటిని లోతట్టు ప్రాంతానికి తరలించవచ్చు ,  అంతేకాక  ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతానికి నీరు తరలించేటప్పుడు అది ప్రవహించే ప్రాంతమంతా నీటి సమస్య తీరుతుంది . నీరు పుష్కలంగా లబించే ప్రాంతం అన్ని రంగాలలోనూఅబివృద్ధి చెందుతుంది .
ప్రాజెక్టులకు అవసరమైన బూ సేకరణ అనుమతుల సేకరణ మరియు బడ్జెట్ కేటాయింపులు ఇలాంటి పనులను చేయడానికి మరి వాటిని కంట్రోల్ చేయడానికి వున్న డిపార్ట్మెంట్లు వాటిని సక్రమంగా చేయడం లేదు . ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు వాటికీ సంబంధించిన అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విదంగా తయారైంది .
అంతేకాదుదీనికంటే ముఖ్యంగా అవినీతి , నిర్లక్ష్యం, నిర్లిప్తత మనం ఎదుర్కొంటున్న మరి కొన్ని సమస్యలు .  వీటిని అదికమించడం మనం అనుకున్నంత సులువుగా సాద్యం కాదు .  ఈ మద్యనే ఎక్కడో చదివిన విదంగా పని చేయని అధికారులు వున్నా ఒకటే లేక పోయిన ఒకటే . ఇటువంటి వారిని ఏమాత్రం వుపేక్షించ రాదు . ఇటువంటి వారిని
ఉపేక్షించడం వలన మొత్తం వ్యవస్థను మనం ప్రమాదంలోకి నెట్టిన వారమవుతం . కనుక మనం ఇటువంటి వారిని అడ్డు తొలగిస్తే అన్ని పనులు వాటికి అవే ముందుకు సాగుతుంది అని నా అబిప్రాయం .

Tuesday 28 August 2012

ఏమి రాయాలో తెలియదు

ఎలా రాయాలో తెలుసు కాని ఏమి రాయాలో తెలియదు . ప్రతి సారి ఏదో ఒకటి రాయాలని ట్రై చేసి చివరికి ఏమీ రాయలేక వదిదేసే వాడిని . కాని ఈరోజు మాత్రం ఏదో ఒకటి రాయాలని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను .
అధికారం చేతులో వున్నా నీటి సమస్య తీర్చలేక పోతున్న గోవర్నమేంట్ పైన  చాలా కోపం వస్తుంది . కాని మనం ఏమిచేయుటకు వీలులేదు . ఆ విషయం మన కంటే ఈ రాజకీయ నాయకులకు చాలా బాగా తెలుసు . అందుకే వారు ఇలా మనతో అట్లాడుకున్తున్నారు .  ఎన్నో కోట్ల ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్న ఈ రాజకీయ నాయకులకి చీమ కుట్టినంతైనా లేక పోవడం విచిత్రంగా వుంటుంది.  కాని ఇక్కడ మరో ట్విస్ట్ వుంది . వారు ఎంత కాటకాలు అడుతున్నారంటే చూసేవారికి వారు నిజంగానే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది .
కాని ఈ సమస్య పరిష్కారం అంత సులువు కాదు . ఈ సమస్య పరిష్కారించే విదానం ఇది కాదు . ఇందుకోసం యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలి . అవసరం ఐతే మిలిటరీ కూడ ఉపయోగించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి . అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలిచి ఈ ప్రాజెక్టులు పూర్తి కావడాని ప్రయత్నాలు ప్రారంబించాలి .

" పది మంది మంచి కోసం ఒకరు చావడానికైనా ఒకరిని చంపదానికైన వెనుకాడ కూడదు " . ఈ మాట ఎందుకు చెపుతున్నాను అంటే , కొన్ని లక్షల మంది మంచి కోసం నిర్మించే ప్రాజెక్టుల వలన కొంత మంది ముంపుకు గురి అవుతారు . వారు తన ఇల్లు పొలం త్యాగం చేయాల్సి వస్తుంది . కనుక అలంటి వారు గొప్ప త్యాగదనులు అవుతారు . వారికి వేరే చోట పునరావాస ఏర్పాట్లు చేసినా కూడా పుట్టిన వూరు వదిలి వెళ్ళడం అంత సులువు కాదు కదా ?