International

Thursday 11 October 2012

ఈ ఊహలకేమి సమాదానం చెప్పాలి ?

నా మనసు నిన్ను వెతికిన ప్రతి సారి నీ ఊహలే తప్ప
నీ జాడ వుండదు .
కానీ నీ పక్కన నేను చేరిన ప్రతి సారి
నువ్వు నన్ను తలస్తావా ?
నన్నుప్రేమతో పిలుస్తావా ? అని ఎదురు చూస్తుంటాను...

Sunday 7 October 2012


మంచు పూల వర్షంలో నీ తోడు లేదని మనసు తడవలేదు.
మండుటెండల్లో సైతం నీకై నా మనసులో ఉన్న
విరహ వేదనకు మించి వేడిని పుట్టించలేదు
నిన్ను కాని నీ ఊహను కాని నేను రమ్మనలేదు .
కానీ,
మదిలోని నిన్ను కాని నీ ఊహను కాని వెల్లగోట్టలేకపోతున్నాను ..

Friday 5 October 2012


నాలోని నేను నువ్వని
నాలోని నన్ను నీకోసమని
ఏ చిరుగాలి తాకినా గుర్తుకొచ్చే నీ స్మృతులకు
ఏ వెన్నెల తాకినా తపించే నా మదికి
ఇంకా నేనెలా చెప్పాలి
ఇంకెప్పుడు చెప్పాలి .....

Murali

Cris Gale అంటే సుడిగాలి



ఇది కొత్త విషయం కాదు . కానీ ప్రతి మ్యాచ్ లో ఎలా ప్రత్యర్తులను చీల్చి చెండాడుతాడో అని ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూంటారు . నిన్న మ్యాచ్ చూస్తున్నంత సేపు నేనూ అలానే ఎదురు చూసాను . కానీ చాలాసేపటి వరకూ స్ట్రైక్ రాలేక పోవడం నాకు విసుగు తెప్పిచింది . కానీ గేల్ మ్యాచ్ చివరి వరకూ ఆడడం చాలా మంచిది అయింది.
కానీ మ్యాచ్ సాగే కొద్దీ గేల్ బ్యాటింగ్ స్పీడ్ అందుకుంది . చూడచక్కని షాట్లతో గేల్ ఆస్ట్రేలియా ను ఆడుకున్నాడు . అతని బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా వారి బౌలింగ్ తేలిపోయింది. 

తెలంగాణా కోరుకోవడం మీ హక్కు .. కానీ


టాంక్బండ్ పైన ప్రముఖుల విగ్రహాలు ద్వంసం చేయడం , వాటి పునప్రథిష్టను అడ్డుకోవడం ఎంత వరకు సబబు ? . ఇటువంటి అరాచక శక్తులను నమ్మి తెలంగాణా ప్రజలు మోసపోతునారు . రాష్ట్రం కలిసిఉండడం లేదా విడిపోవడం మాట పక్కన పెడితే ఇటువంటి చర్యలు ఎలా సమర్థిస్తారు? ఇన్ని వందల మందిని ఆత్మహత్యలకు వుసికొలిపింది వీరు కాదా ? మానసికంగా వారిని వసపరుచుకొని వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది ఈనాటి రాజకీయ నాయకులు కాదా ? ఇంతమంది తల్లుల కడుపుకోతకు వీరు బాద్యులు కారా . ఈ రాజకీయ నాయకుల వారసులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోరు ఎందుకు ? తెలంగాణ ఏర్పాటు ఇంతమంది కోరుతున్నారు కదా మరి ఇంతకు తెలంగాణ ఏర్పాటు ఐతే వీరికి కలిగే ప్రయోజనాలు ఏమిటో క్లియర్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుకూ తెలియచేయాలి .

గవర్నమెంట్ జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .

ప్రైవేటు జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .

నీటి వనరులు పెరుగుతుందా ? ఐతే ఎలా పెరుగుతుంది ?

వున్న నీటివనరులు సరిగా వినియోగం చేసుకుంటార ? ఎలా చేసుకుంటారు ?

ఇక్కడ అందరూ అంటున్న పదం ఒకటుంది . మా నేల పైన మీ పెత్తనం ఏమిటని . ఇక్కడ మీ నేల మా నేల అని కాదు . ఈరోజు మీరు వేరే కుంపటి పెట్టుకుంటే నష్టపోయేది మిగిలిన ప్రాంత వాసులే అనే విషయం మరువరాదు . అందుకే తెలంగాణా సోదరులారా . మీ ప్రాంతం మీ ఇష్టం . మీ ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎవరు కాదు అనలెరు . ఎందుకంటే అది మీ హక్కు . మిగిలిన ప్రాంత వాసులు నష్టపోతారు అని మీ కోరికను కాదనడం కూడా సమంజసంగా లేదు . కాని ఆత్మహత్యల వరకు వెళ్ళడం తల్లిదండ్రులు దిక్కులేనివారిని చేసి స్వార్థ రాజకీయ శక్తులు వారి మాటలకు ప్రలోబాలకు లొంగి మీ జీవితాన్ని బలిచేసుకోవద్దు . మీరు విడిపోయాక కూడా మనమందరం ఇలాగె కలిసివుందాం అనే ఒక వాతావరణం క్రియేట్ చేయండి . విద్వంసం సమస్యలు పరిష్కారం కాదు . ఇలాంటి సంగటనలు సమస్యలను ఇంకా జటిలం చేస్తుండే కానీ వేరే ఒరిగేదేమీ లేదు .

మీ అబిప్రాయాన్ని కూడా తెలియచేయండి