International

Friday 5 October 2012

తెలంగాణా కోరుకోవడం మీ హక్కు .. కానీ


టాంక్బండ్ పైన ప్రముఖుల విగ్రహాలు ద్వంసం చేయడం , వాటి పునప్రథిష్టను అడ్డుకోవడం ఎంత వరకు సబబు ? . ఇటువంటి అరాచక శక్తులను నమ్మి తెలంగాణా ప్రజలు మోసపోతునారు . రాష్ట్రం కలిసిఉండడం లేదా విడిపోవడం మాట పక్కన పెడితే ఇటువంటి చర్యలు ఎలా సమర్థిస్తారు? ఇన్ని వందల మందిని ఆత్మహత్యలకు వుసికొలిపింది వీరు కాదా ? మానసికంగా వారిని వసపరుచుకొని వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది ఈనాటి రాజకీయ నాయకులు కాదా ? ఇంతమంది తల్లుల కడుపుకోతకు వీరు బాద్యులు కారా . ఈ రాజకీయ నాయకుల వారసులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోరు ఎందుకు ? తెలంగాణ ఏర్పాటు ఇంతమంది కోరుతున్నారు కదా మరి ఇంతకు తెలంగాణ ఏర్పాటు ఐతే వీరికి కలిగే ప్రయోజనాలు ఏమిటో క్లియర్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుకూ తెలియచేయాలి .

గవర్నమెంట్ జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .

ప్రైవేటు జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .

నీటి వనరులు పెరుగుతుందా ? ఐతే ఎలా పెరుగుతుంది ?

వున్న నీటివనరులు సరిగా వినియోగం చేసుకుంటార ? ఎలా చేసుకుంటారు ?

ఇక్కడ అందరూ అంటున్న పదం ఒకటుంది . మా నేల పైన మీ పెత్తనం ఏమిటని . ఇక్కడ మీ నేల మా నేల అని కాదు . ఈరోజు మీరు వేరే కుంపటి పెట్టుకుంటే నష్టపోయేది మిగిలిన ప్రాంత వాసులే అనే విషయం మరువరాదు . అందుకే తెలంగాణా సోదరులారా . మీ ప్రాంతం మీ ఇష్టం . మీ ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎవరు కాదు అనలెరు . ఎందుకంటే అది మీ హక్కు . మిగిలిన ప్రాంత వాసులు నష్టపోతారు అని మీ కోరికను కాదనడం కూడా సమంజసంగా లేదు . కాని ఆత్మహత్యల వరకు వెళ్ళడం తల్లిదండ్రులు దిక్కులేనివారిని చేసి స్వార్థ రాజకీయ శక్తులు వారి మాటలకు ప్రలోబాలకు లొంగి మీ జీవితాన్ని బలిచేసుకోవద్దు . మీరు విడిపోయాక కూడా మనమందరం ఇలాగె కలిసివుందాం అనే ఒక వాతావరణం క్రియేట్ చేయండి . విద్వంసం సమస్యలు పరిష్కారం కాదు . ఇలాంటి సంగటనలు సమస్యలను ఇంకా జటిలం చేస్తుండే కానీ వేరే ఒరిగేదేమీ లేదు .

మీ అబిప్రాయాన్ని కూడా తెలియచేయండి

2 comments:

  1. మీ ఇష్టం ... మీరు ఎంత గందరగోలంగా నైనా రాయవచ్చు

    తెలంగాణాకు మేం అనుకూలం అని కాంగ్రెస్ అంది.
    తెలంగాణాకు మేం అనుకూలం అనితెలుగు దేశం పార్టీ అంది.

    కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పెట్టారు.
    రాష్ట్రపతి చేత ప్రధాన మంత్రి చేత పార్లమెంటు లోచెప్పించారు.

    చివరికి డిసెంబర్ ౯, ౨౦౦౯ నాడు కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోమ్ మంత్రి The process of formation of Telangaanaa state will be initiated and an appropriate resolution will be moved in Andhra Pradesh Assembly .. ప్రకటించారు.

    ఇంత జరిగాక యూ టర్న్ తీసుకుని దొంగ నాటకాలు ఆడుతున్నారు.
    నిబద్ధత లేని, నిజాయితీ లేని ఈ రాజకీయ నాయకుల వికృత చేష్టల వల్లనే కదా ఈ ఆత్మహత్యలు, గొడవలు జరుగుతున్నాయి.

    అసలు వాస్తవాన్ని పక్కన పెట్టి మీరు ఏదేదో రాసారు. కనీ మీరు అన్నట్టు
    >>>>>> మీ ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎవరు కాదు అనలెరు . <<<<<<<
    నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని వుంటే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఏంటో ప్రశాంత వాతావరణం లో జరిగి వుండేది.

    ఆంధ్ర తెలంగాణా ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోయి కలిసివుండేవాళ్ళు.
    తమిళనాడు నుంచి విడిపోయిన తరువాత ఆంధ్ర తమిళ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి వుండటం లేదా అలాగే.

    కాని చెత్తనా కొడుకుల చెత్త రాజకీయాలు మన సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి.

    A Hyderabadi

    .

    ReplyDelete
    Replies
    1. ఇంత లాంగ్ రిప్లై లో అసలు సమాదాన్ని దాటవేశారు .

      Delete