International

Tuesday 28 August 2012

ఏమి రాయాలో తెలియదు

ఎలా రాయాలో తెలుసు కాని ఏమి రాయాలో తెలియదు . ప్రతి సారి ఏదో ఒకటి రాయాలని ట్రై చేసి చివరికి ఏమీ రాయలేక వదిదేసే వాడిని . కాని ఈరోజు మాత్రం ఏదో ఒకటి రాయాలని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను .
అధికారం చేతులో వున్నా నీటి సమస్య తీర్చలేక పోతున్న గోవర్నమేంట్ పైన  చాలా కోపం వస్తుంది . కాని మనం ఏమిచేయుటకు వీలులేదు . ఆ విషయం మన కంటే ఈ రాజకీయ నాయకులకు చాలా బాగా తెలుసు . అందుకే వారు ఇలా మనతో అట్లాడుకున్తున్నారు .  ఎన్నో కోట్ల ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్న ఈ రాజకీయ నాయకులకి చీమ కుట్టినంతైనా లేక పోవడం విచిత్రంగా వుంటుంది.  కాని ఇక్కడ మరో ట్విస్ట్ వుంది . వారు ఎంత కాటకాలు అడుతున్నారంటే చూసేవారికి వారు నిజంగానే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది .
కాని ఈ సమస్య పరిష్కారం అంత సులువు కాదు . ఈ సమస్య పరిష్కారించే విదానం ఇది కాదు . ఇందుకోసం యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలి . అవసరం ఐతే మిలిటరీ కూడ ఉపయోగించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి . అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలిచి ఈ ప్రాజెక్టులు పూర్తి కావడాని ప్రయత్నాలు ప్రారంబించాలి .

" పది మంది మంచి కోసం ఒకరు చావడానికైనా ఒకరిని చంపదానికైన వెనుకాడ కూడదు " . ఈ మాట ఎందుకు చెపుతున్నాను అంటే , కొన్ని లక్షల మంది మంచి కోసం నిర్మించే ప్రాజెక్టుల వలన కొంత మంది ముంపుకు గురి అవుతారు . వారు తన ఇల్లు పొలం త్యాగం చేయాల్సి వస్తుంది . కనుక అలంటి వారు గొప్ప త్యాగదనులు అవుతారు . వారికి వేరే చోట పునరావాస ఏర్పాట్లు చేసినా కూడా పుట్టిన వూరు వదిలి వెళ్ళడం అంత సులువు కాదు కదా ?

1 comment: