International

Monday 25 August 2014

ఎంత మొత్తుకొంటే మాత్రం ఏమి ప్రయోజనం

ఎంత  మొత్తుకొంటే  మాత్రం ఏమి ప్రయోజనం .. మన నాయకుల తీరు మార లెదు. అరె కనీసం స్పీకర్  మాట్లాడేటప్పుడు కూడా మార్కెట్లో అరుస్తున్నట్లు ఆ గోల ఏమిటో .. వీళ్ళు ఎప్పటికి మారతారో మన తలరాతలు ఎప్పటికి మారుస్తారో చూద్దాం

నాకు ఒక బ్రహ్మ సందేహమ్. మన రాజకీయ నాయకులకు నిజంగా అవినీతిని అంతం చేయాలనే తపన  వుంటే , ప్రతిఒక్క ఆఫీసులో సి సి టీవీ పెట్టచ్చుగా? వాటిని అంత ఓకే టీం ద్వారా మానిటర్ చేయ వచ్చు కదా ?
ఇలా ఎందుకు జరగడం లేదు ? మీకేమైనా తెలిసుంటే నాకు కాస్త చెప్పరూ .....

Saturday 23 August 2014

పెరుగుతున్న కాయకూరల ధరలు ఎలా నియంత్రించాలి ?

పెరుగుతున్న కాయకూరల ధరలు ఎలా నియంత్రించాలి ?

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి . రైతులకు వున్న సమస్యలని అర్థం చేసుకోవానికి ప్రత్యేకంగా మండలాని ఒక టీం చొప్పున నియమించలి. వారు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చి వారిని ప్రోత్సైంచాలి . వారి అన్ని విడల సహాయాని అందించి పంటలను పండించి దానిని ఒక న్యాయసమ్మతమైన ధరను నిర్ణించి ప్రబుత్వమే కొనాలి . ప్రతి ఒక్క వూరికి ఒక అధికారి నియమించి ఈ విదంగా అమలు పరిస్తే అన్ని పంటలు పెరిగి వాటి ధరలు కూడా అదుపులోకి వస్తుంది . కాని ఈ విధంగా జరగాలంటే వ్యవసాయానికి నీరు చాలా  అవసరామౌతుంది . మరి నీరు కావాలంటే నదుల అనుసంధానం తప్ప వేరే ధరి లేదు . మరి ప్రబుత్వం ఈ నదుల అనుసంధానం విషయంలో ఎంత చిత్తసుద్ధి చూపిస్తుందో చూడాలి

Friday 22 August 2014

మహారాజశ్రీ రాజకీయనాయకులారా


అయ్యా మహారాజశ్రీ రాజకీయనాయకులారా ,
కొన్ని కోట్ల మంది వేసిన ఓట్ల వలన మీకు ఈరోజు ఈ సీట్లు వచ్చింది . మరి మీరు వారికి చేస్తున్న ప్రత్యుపకారం ఏమిటి అని ఏరోజైన ఆలోచించారా ? మీరు ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తిసున్న విదానాన్ని మీరు ఒక సారి సమీక్షించుకోవాలి .  మీరు చర్చిన్చుకోవాల్సిన విషయాలు కొన్ని వందలు వున్నయి.  మరి వాటిని అంతా  గాలికి వదిలేసి ఈ విదంగా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు ?
తెలుగు జాతి రెండుగా మూకలు చేయబడింది . కొన్ని కోటల హృదయాలు బాధతో బరువెక్కి మీరు వేయబోయే  ప్రతి ఒక్క అడుగు వైపు ఏంటో ఆశగా ఎదురు చూస్తోంది . ఆంధ్రుల  జీవితంలో ఇది ఒక చారిత్రక మలుపు అన్న విషయాని మరువకండి . ఈరోజు మీరు వేసే ప్రతి ఓకే అడుగు ఓకే చారిత్రక మలుపు అని మా అబిప్రయమ్. అందుకే మీకు చర్చించుకోవడాని కొన్ని వేల సమస్యలు వున్నాయి . దయచేసి వాటిపైన కాస్త  ద్రుష్టి పెట్టిన వాటికోసం కొంత సమయం కేటాఇంచండి .
ఐన కాని మీకు నిజంగా ఒకరిపైన ఒకరి కి అధిపత్యం నిరూపించుకోవాలి అనుకుంటే , వారి వారి నియోజకవర్గంలో అబివృద్ధి చేసి ఎదుటవారిని నోరు మూయించండి .

కాని ,
అన్నింటికంటే ముందు మీ నియోజకవర్గంలో వున్న ప్రజల గురుంచి పూర్తి వివరాలు సేకరించండి .
1. మొత్తం ఎన్నని కుటుంబాలు వున్నయి. వ్యవసాయం పైన అదారపడ్డ కుటుంబాలు ఎన్ని ?
2. ఎంతమంది నిరుద్యోగులు వున్నారు ? ఎంతమంది వుద్యగులు వున్నారు ?
3. నీరు లేక ఎండిపొఇన బూమి ఎంత? నీరు వూన బూమి ఎంత ?
నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాసాను . ఇంకా  ఎన్నో సమస్యల ప్రతి గ్రామంలోనూ  మీకోసం ఎదురు చోస్తుంది ...

ఆ సమస్యల పైన చర్చించడానికి ప్రయత్నిస్తే అది అందరికి ప్రయోజనంగా వుంటుంది అని నా అబిప్రాయం

అన్ని తెలుగు చానల్ను ఒక మాట అడగాలి .....

1  ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 13 జిల్లాలే కదా? మరి ఇంకా మీ న్యూస్ చానెల్లో తెలంగాణా గురించే ఎందుకు ప్రసారం చేస్తున్నారు ?
2. మన 13 జిల్లాల్లో వున్నా మండలాల్లో ఉన్న్న సమస్యల పైన మీ కవరేజ్ ఎందుకు వుండదు ?
3.  చాలా గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడుతోంది . వాటికోసం ప్రకటించిన ప్రాజెక్ట్లు అసలు ముందుకు సాగడం లేదు . మీరు ప్రజల మంచి కోరే వారే అయితే మరి దీనిని గురించి ఎందుకు ప్రసార కార్యక్రమాలు లేదు ?
4. సెపరేట్  స్టేట్  ఏర్పడి మూడు నెలలు కావస్తుంది . ఇంకా టీవీ చానల్స్ కాని మరి సినిమా ఫెఇల్ద్ గాని మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు ?
5. అన్ని వున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా , ఏంటో నిధి నిక్షేపాలు , వనరులు వున్నా ఏమాత్రం అబివృద్దికి నోచుకోని రాయలసీమను ఎలా అబివృద్ధి చేస్తారు అని ప్రబుత్వాన్ని ఎందుకు అడకలేక పోతున్నారు ?

ఒక పౌరిడిగా నాకు అడగాలనిపించింది , అందుకే అడుగుతున్నాను ... దయచేసి నా అనుమానాలు తీర్చగలరు